మహేష్ సరసన ఆ క్రేజీ బ్యూటీ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ను ఆగస్ట్ నెల నుండి ప్రారంభించనున్నట్లు అలాగే మూవీ ని వచ్చే సంవత్సరం వేసవి లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చనుండగా,  పూజా హెగ్డే ,  మహేష్ బాబు సరసన ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన ఇద్దరు కథానాయకులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో మెయిన్ హీరోయిన్ గా చిత్ర బృందం పూజా హెగ్డే ను ఎంపిక చేసుకోగా, రెండవ హీరోయిన్ కూడా ఇప్పటికే చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాలో రెండో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను చిత్ర బృందం కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ ,  శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం మూవీ లలో హీరోయిన్ గా నటించింది.

అలాగే తమిళ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్ , డాన్ మూవీ లతో అదిరిపోయే విజయాలను అందుకొని కోలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా తెలుగు మరియు తమిళ నాట ఫుల్ క్రేజ్ ఉన్న ప్రియాంక అరుల్ మోహన్ ను మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో రెండో హీరోయిన్ గా చిత్ర బృందం సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: