ఇండస్ట్రీ పెద్దలు ఎంత బ్రతిమాలినా.. వెంకటేష్ అందుకు ఒప్పుకోలేదట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్ గా ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన స్టార్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకటేష్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలు సాధించి విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. విలక్షణమైన నటనతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వెంకటేష్. ఇక దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో ఎంతోమంది దర్శకులు హీరోలు హీరోయిన్లతో కలిసి నటించాడు వెంకటేష్.

 అయితే సాధారణంగా ఒకే హీరోయిన్ తో ఎక్కువ సార్లు కలిసి ఏ హీరో అయినా నటించాడు అంటే చాలు ఆ హీరో హీరోయిన్ మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్ తెర మీదికి రావడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  కానీ విక్టరీ వెంకటేష్ మీద ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా రాలేదట. దీనిని బట్టి ఆయన పని పట్ల ఎంత ఖచ్చితత్వంతో నిబద్ధతతో ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించాడు. అయితే ఇటీవలే మాజీమంత్రి మురళీమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో వెంకటేష్ గురించి ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి దాదాపు అందరికి తెలిసిందే  ఇటీవల కాలంలో మా ఎన్నికల వచ్చాయంటే సెలబ్రిటీలు అందరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఒకప్పుడు మాత్రం మా ఎన్నికలు ఇలా జరిగేవి కావు. ఇండస్ట్రీ  పెద్దలు నిర్ణయించిన  వారిని ఏకగ్రీవంగా ఒక ప్రెసిడెంట్ గా ఎన్నుకునే వారు. ఇప్పటివరకు చిరంజీవి నాగార్జున మోహన్బాబు లాంటి పెద్దలు కూడా మా ప్రెసిడెంట్ గా పని చేశారు అన్న విషయం తెలిసిందే. ఇలాగే ఓసారి విక్టరీ వెంకటేష్ ని కూడా మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ గా ఉండాలని కోరారు ఇండస్ట్రీ పెద్దలు.  కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. ఇండస్ట్రీ పెద్దలు ఎంత బతిమిలాడినా వెంకటేష్ మాత్రం బయట విషయాలు నాకు ఏమీ తెలియదు. అలాంటి విషయాల్లో తలదూర్చ కూడదు.. నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆ హోదా కి సరిపడా అంటూ ముఖం మీద చెప్పేశాడట. పెద్దలు బాగా పట్టుబట్టడంతో చివరికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పని చేయడానికి వెంకటేష్ ఒప్పుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: