ఆఫర్స్ కోసం కష్టపడుతున్న రకుల్...!!

murali krishna
ఫేడ్ అవుట్ దశలో ఉన్న క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సడెన్ గా యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తోందట.అలాగే షో రూమ్ లను ఓపెన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉందట.


ఐతే, రకుల్ లో మాత్రం మునపటి లేతతనం లేదు. పెరుగుతున్న వయసు రీత్యా కావొచ్చు.. రకుల్ పేస్ లో ఒకప్పటి కళ కూడా తప్పింది. ప్రస్తుతం ఈ భామ ముంబైలోనే ఉంటుంది. ఐతే, ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఒక ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆ ఫంక్షన్ లో అమ్మడు దట్టమైన మేకప్ వేసుకున్నప్పటికీ.. మొహంలోని ఆ ముదురు తనం కొట్టొచ్చినట్టు సృష్టంగా కనిపిచిందట.


మరి అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల్లో మళ్ళీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశ పడుతుంది. ఫంక్షన్ అయిపోయాక, రకుల్ నేరుగా హైదరాబాద్ లోని నాని అఫీస్ కి వెళ్ళిందట.. తనకు హీరోయిన్ గా ఒక ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ కూడా చేసింది. నాని - రకుల్ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో ఈ జంట కలిసి నటించకపోయినా కానీ కలిసి జిమ్ కి వెళ్లేవారు.


వీరి మీద అనేక పుకార్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. నిప్పు లేనిది పొగ రాదు కదా. ఎంత దగ్గర బంధం లేకపోతే, ఎప్పుడో తెగిపోయిన బంధాన్ని వెతుక్కుంటూ రకుల్ ఎందుకు నాని దగ్గరకు వెళ్తుంది. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా సరిగ్గా లేదు. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తాం అంటే.. ముంబై వెళ్లి అక్కడ సినిమాలే చేస్తాను అంటూ బిల్డప్ ఇచ్చింది.


కానీ, కాలం గడిచే కొద్దీ రకుల్ కూడా చాలా మారింది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక, ఆమె ఆలోచనా విధానం కూడా మారిందట. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి నాని, రకుల్ కి ఛాన్స్ ఇపిస్తాడో లేదో చూడాలి.


నాని హీరోగా 'నేను లోకల్' ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను రకుల్ కి నాని ఇప్పిస్తాడేమో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: