ఈ యంగ్ హీరో కు ఇంత క్రేజ్ ఏంటి బాసూ? అన్ని సినిమాలా?

VAMSI
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం అన్న పేరు మోత మోగుతోంది. అదేంటి చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఇంతలోనే అంత క్రేజ్ తెచ్చుకున్నాడా ? అంటే టైం బాగుంటే అంతే మరి అన్ని అలా కలిసొచ్చాస్తాయి. అందులోనూ మనోడి టాలెంట్ కు ఏమాత్రం కొదవ లేదు.. ఇంకేముంది ప్రతిభ, అదృష్టం కలిసొచ్చి కిరణ్ అబ్బవరం ను అంబరానికి ఎత్తేస్తున్నాయి. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవట్లేదు. కానీ ఈ యంగ్ హీరో కి సినిమా ఫలితంతో సంబందం లేకుండా క్రేజ్ అలా పెరిగిపోతుంది. ఇలా సినిమాల రిజల్ట్ తో సంబందం లేకుండా తమ ఫాలోయింగ్ ను పెంచుకునే అతి కొద్ది మంది స్టార్స్ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా చేరాడనే చెప్పాలి.
ఇప్పటికే ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. కరోనా పుణ్యమా అని పెద్ద పెద్ద హీరోల సినిమాలే డైలమాలో వుంటే, వరుస చిత్రాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటూ  పోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో పుట్టినరోజు నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ ఆయన తాజా సినిమాల అప్‌డేట్స్ ఇస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.  'మీటర్', 'రూల్స్ రంజన్', 'వినరో భాగ్యము విష్ణు కథ', 'మీకు బాగా కావాల్సిన వాడిని..' వంటి పలు ప్రాజెక్ట్ లతో ఒక్క క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉన్నారు కిరణ్.
మరి ఈ హీరో వరుస చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అన్నది చూడాలి. ఈ హీరో కి తన వాయిస్ , బాడీ లాంగ్వేజ్ ఇండస్ట్రీలో దూసుకెళ్లడానికి బాగా ప్లస్ అయ్యాయి. అంతే కాకుండా మన ఇంట్లో అల్లరి అబ్బాయిల అనిపించేలా అతడి నటన తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా చేసింది. మన అన్న ఫీలింగ్ ఒక్కసారి మొదలయ్యాక ఇక మన తెలుగోళ్ళు ఎంతగా ఆదరిస్తారు అన్నది తెలిసిందే ఇంతటి ప్రేమను చొరగొన్న కిరణ్ అబ్బవరం నిజంగా గ్రేట్ అంటున్నారు అంతా !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: