53 ఏడేళ్ళ చరిత్రలో ఆర్ ఆర్ ఆర్ !

Seetha Sailaja
రాజమౌళి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల సీన్స్ కు కాపీ అంటూ అనేకసార్లు విమర్శలు వచ్చాయి. అలా విమర్శలు వచ్చిన ప్రతిసారి జక్కన్న తాను కొన్ని సినిమాలను అనుసరిస్తాను కానీ కాపీ కొట్టను అంటూ సమాధానం ఇస్తూ వచ్చాడు. కేవలం రాజమౌళి మాత్రమే కాదు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడ తాను అందించే కథలలో కొన్ని కాపీలు ఉంటాయి అంటూ అనేకసార్లు విమర్శలు కూడ వచ్చాయి.

చిరంజీవి నటించిన ‘పసివాడిప్రాణం’ కథకు కొద్దిగా మార్పులు చేసి విజయేంద్ర సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగి భాయిజాన్’ కథను వ్రాసాడు అన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా రాజమౌళి కెరియర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన ‘సింహాద్రి’ మూవీ కథకు కొంతవరకు కమలహాసన్ నటించిన ‘వసంతకోకిల’ స్ఫూర్తి అన్న విమర్శ కూడ వచ్చింది. ఇప్పుడు ఈసంవత్సరం విడుదలై చరిత్ర సృష్టించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇంటర్వెల్ సీన్ ను కూడ రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కాపీ కొట్టాడు అంటూ సరికొత్త విమర్శలు మొదలయ్యాయి.

1969లో వచ్చిన మంచి మిత్రులు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇంటర్వెల్ లో కనిపిస్తాయి అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ‘మంచి మిత్రులు’ సినిమాలో కృష్ణ దొంగ గా నటిస్తే శోభన్ బాబు పోలీసు గా నటిస్తాడు. అయితే శోభన్ బాబు పోలీసు అని తెలియకుండా కృష్ణ అతడితో సన్నిహితంగా ఉంటున్నప్పుడు ఆసినిమా ఇంటర్వెల్ ముందు శోభన్ బాబు కృష్ణను అరెస్ట్ చేసి తాను పోలీసు ని అని చెప్పి షాక్ ఇస్తాడు.

ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో కూడ ఆమూవీ ఇంటర్వెల్ వరకు జూనియర్ కు చరణ్ పోలీసు ఆఫీసర్ అన్న విషయం తెలియదు. కేవలం ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ లో చరణ్ జూనియర్ ను అరెస్ట్ చేస్తూ తాను పోలీస్ ని అని చెప్పి షాక్ ఇస్తాడు. ఈసీన్ జరాక్స్ కాపీలా ‘మంచిమిత్రులు’ సినిమా నుండి రాజమౌళి కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: