రామ్ చరణ్ వేరే లెవెల్ సినిమా చేస్తేనే!!

P.Nishanth Kumar
రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకులను ఎంతో అలరించే సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు కూడా తన అభిమానులను అలరించే సినిమాలను చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం. ఆ విధంగా రామ్ చరణ్ ప్రేక్షకులను ఎంతగానో ఆనందింపచేసే సినిమాలను వరుసగా చేస్తున్నాడని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటించిన తీరుకు ప్రేక్షక లోకం ముగ్ధులైపోయింది.

ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడంతో హాలీవుడ్ సైతం చిత్రానికి జేజేలు పలుకుతున్నారు. ఈ సినిమా లో రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఎంతగానో ముగ్ధులయ్యారు. అందుకే ఆయన హాలీవుడ్ లో కూడా నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నారు అక్కడి మేకర్స్. చరణ్ పాత్రను చూసి ఎంతగానో మెచ్చిన చాలామంది వచ్చే సినిమాలోని ఆయన పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆయన అక్కడ సినిమాలు చేసే విధంగా ఆలోచనలు చేస్తారా అనేది చూడాలి.  శంకర్ దర్శకత్వం లోని సినిమా తర్వాత ఆయన గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. 

ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి మరొక సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్ని 
 సినిమాలు ఆయన చేయబోతున్న నేపథ్యంలో ఆయన హాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమా చేస్తాడో చూడాలి. బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆయన గతంలో పరిచయమైన తుఫాన్ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ముందు అక్కడ అందరినీ అలరించి ఆ తర్వాత హాలీవుడ్ ఆలోచనలు చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది మెగా అభిమానులు చెబుతున్న మాట. తొందర పడకుండా ముందుగా ఇండియాలో మంచి కెరీర్ ను సెట్ చేసుకోవాలని వారు ఆయనకు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: