ఎట్టకేలకు అన్ స్టాపబుల్ -2 అప్డేట్ వచ్చేసిందిగా..!!

Divya
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా ఫస్ట్ టైం హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ మంచి విజయవంతం చేశారు బాలయ్య. ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ ప్రశంసించడం జరిగింది. బాలకృష్ణ నుంచి అన్ స్టాప్ అబుల్ షో మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా చేయడం జరిగింది. దీంతో బాలయ్య అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇందుకు సీక్వెల్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుచేతనే సీక్వెల్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా అన్ స్టాపబుల్ -2 కు సంబంధించి ఒక ప్రకటన వెలువడడం జరిగింది తాజాగా మరో అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆగస్టు నుంచి అన్ స్టాపబుల్ షో ప్రారంభమగుతున్నట్లుగా ఆహా టీం నుండి సమాచారం తెలుస్తోంది. ఈ సీజన్ పై ప్రేక్షకులు మరింత ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. చిరంజీవి మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో కనిపించే బోయే విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇంకా పలువురు స్టార్ హీరోలు కూడా ఈసారి బాలయ్యతో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ మరొకసారి అన్ స్టాపబుల్ అనబోతున్న నేపథ్యంలో అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూడడం జరుగుతుంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి నెట్వర్క్ కూడా ప్రారంభం అయింది. త్వరలోనే మొదటి ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా బాలకృష్ణ పాల్గొనబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ సినిమాలు విషయానికి వస్తే డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో NBK -107 సినిమా చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ కోసం టర్కీ కి వెళ్లారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చి అన్ స్టాపబుల్ షో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య మరియు గోపీచంద్ కాంబినేషన్లో సినిమా విడుదల కు ముందే ఈ అన్ స్టాపబుల్ -2 స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: