ప్రభాస్ ఛత్రపతి లాంటి సినిమా మిస్ అయ్యాడే..!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన కెరియర్ ఆరంభంలో చేసిన సినిమాలే కారణం అని చెప్పాలి. ఏ హీరో కైనా సినిమా సినిమాకు మంచి పరిణితితో పాటు కథల ఎంపిక కూడా ఎంతో బాగా ఉండాలి. అప్పుడే ఎంత నార్మల్ హీరో అయినా కూడా పెద్ద హీరో అయ్యే ఛాన్స్ లే వస్తాయి. ఆ విధంగా ప్రభాస్ కెరియర్ లో మొదట్లో చేసిన వర్షం చత్రపతి సినిమాలు ఆయనకు ఎంతటి విజయాన్ని తెచ్చిపెట్టాయియో అంతే ఒక క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టాయి.

ఆ రెండు సినిమాల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనకు కోట్లాదిమంది ప్రేక్షకులు అభిమానులుగా మారారు. అలా ప్రభాస్ ఇటీవల చేసిన బాహుబలి సినిమా కూడా దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుని ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేలా చేసింది. అలా ట్రెండ్ కు తగ్గ మార్కెట్ తగ్గ సినిమాలను చేస్తూ ఇప్పుడు ఇంతటి స్థాయి హీరోగా ఎదిగిన ప్రభాస్ కెరియర్ మొదట్లో మిస్ చేసిన ఓ సినిమా చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ చక్రం అనే ఓ సినిమాను చేసిన విషయం తెలిసింది ఈ చిత్రం ఆయనకు మంచి సక్సెస్ ని తెచ్చి పెట్టకపోయినా కూడా వెరైటీ సినిమాగా మంచి నటుడుగా ఆయనను నిరూపింఛిన సినిమా. అయితే ఈ చిత్రం యొక్క దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కోసం రెండు కథలు చెప్పానని రెండు కథలలో చక్రం కథకే ఆయన ఒకే చెప్పడని అన్నారు. అయితే  ఇంకో సినిమా యొక్క కథ ఏంటి అని అడగగా అది ఫక్తు మాస్ కమర్షియల్ సినిమా అని గుప్త నిధుల వేట నేపథ్యంలో ఆ చిత్రం ఉంటుందని అది కనుక చేసి ఉంటే ప్రభాస్ రేంజ్ ప్పుడే పెరిగిపోయేది అని వెల్లడించారు. ఆ విధంగా ప్రభాస్ అభిమానులు ఆ చిత్రం చేస్తే బాగుండేదని చెవులు కోరుకుంటునారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: