ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్ల లాభాలను సాధించిన 'మేజర్' మూవీ..!

Pulgam Srinivas
క్షణం , గూడచారి , ఎవరు సినిమాలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న అడవి శేషు తాజాగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

ఇది వరకే అడవి శేషు , శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన గూడచారి సినిమా మంచి విజయం సాధించడంతో మేజర్ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న మేజర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమాకు దాదాపుగా 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 18 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న మేజర్ సినిమా 19 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. 19 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మేజర్ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే అదిరిపోయే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే 19 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. 

మొత్తంగా చూసుకుంటే మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 33.35 కోట్ల షేర్ , 64.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మేజర్ సినిమా 14.35 కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటించగా,  ప్రకాష్ రాజు ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: