"20 కోట్ల బడ్జెట్... 100 కోట్ల కలెక్షన్" చిన్న సినిమా పెద్ద విజయం !

VAMSI
సినిమా అంటే ఇప్పుడు ప్రేక్షకులు కానీ లేదా ఇండస్ట్రీ వర్గాలు కానీ ఒకరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. యాక్షన్ స్థాయి మామూలుగా ఉండకూడదు, పెద్ద పెద్ద సెట్టింగ్ లు, భారీ తారాగణం ఇలా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అయితే సినిమా అనేది ఒక మంచి కథ అంతకు మించిన కథనంతో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని సంతోష పెట్టడమే. అయితే ఈ తరహాలో చాలా తక్కువ సినిమాలు వస్తుంటాయి. ఇలాంటి సినిమాలే చాలా కాలం అలా మనసులో ఉండిపోతాయి. అటువంటి సినిమాలలో ఒకటి కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ. ఇది 20 కోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని తెలిసిన విషయమే. కానీ ఈ సినిమా పెద్ద సినిమా అంతా హిట్ ను సాధించి అన్ని ఇండస్ట్రీ లలో హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ వివరాలను చూస్తే నమ్మకం రాదు. అంతలా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని చిన్న చిత్రాలకు రారాజుగా మారి 100 కోట్ల కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఇంకా థియేటర్ లలో విజయవంతంగా రన్ అవుతోంది. మంచి కథలను సినిమాలుగా తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు అని చెప్పడానికి ఇది సరైన ఉదాహరణగా మిగిలింది. దర్శకుడు కిరణ్ రాజ్ చాలా ఫ్రెష్  కథను ఎంచుకోడంలోనే  సగం సక్సెస్ అయ్యాడు. ఇక కథనంలో ఎటువంటి లోపాలు లేకుండా చివరి వరకు గ్రిప్పింగ్ గా నడిపించాడు. ఇందులో కీలక పాత్రలలో నటించిన హీరో రక్షిత్ శెట్టి మరియు కుక్క లు ఎంత అద్భుతంగా నటించారు అన్నది సినిమా చూస్తే అందరికీ తెలుస్తోంది.
ఇందులో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అంశాలలో హీరో మరియు కుక్క మధ్యన వచ్చిన సెంటిమెంట్ సన్నివేశాలు. మామూలుగా దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో పెట్ డాగ్స్ ఉంటాయి. అయితే అవి యజమానులకు చాలా అటాచ్ అవుతాయి. వాటికి ఏమయినా అయితే యజమానులు అస్సలు తట్టుకోలేరు. చాలా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మనిషి మరియు మూగ జీవికి మధ్యన ఒక రిలేషన్ ఎలా ఉంటుంది అన్నది దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కుక్కలకు బాగా కనెక్ట్ అయిపోతారు. ఇలాంటి కథలు రావడం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. ఈ సినిమాను ఇంకా చూడని వారు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: