గాలి జనార్దన్ రెడ్డి పై హత్యాయత్నం.. 8 రౌండ్లు కాల్పులు..?

Divya
కర్ణాటక బళ్ళారిలో తాజాగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గీల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం పెద్దదవ్వడంతో కాంగ్రెస్,గాలి వర్గీయుల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు.8 రౌండ్లు కాల్పులు జరపగా ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.


బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద నిన్నటి రోజున రాత్రి కాంగ్రెస్ ,బిజెపి కార్యకర్తలు మధ్య ఘర్ష చోటుచేసుకుంది. అనంతరం జరిగిన కాల్పులలో ఒక మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు తనపై జరిగిన హత్యయత్నమేనని తాను ఇందులో నుంచి త్రుటిలో తప్పించుకున్నాను అంటూ గాలి జనార్దన్ రెడ్డి తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన నగర్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి మాట్లాడుతూ తనకు అంత అవసరం లేదని గాలి జనార్ధన్ జరిపినటువంటి కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందారంటూ మాట్లాడుతున్నారు. దీంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలోనే పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది.


నారా భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య పరస్పర మాటలు యుద్ధం కొనసాగుతోంది..తన ఇంటి ఆవరణంలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చారని, అనంతరం ఆ బ్యానర్ కింద పడిపోవడంతో దీనిపైన క్షమాపణ చెప్పి బ్యానర్ కడతామని చెప్పిన కూడా వినకుండా తన ఇంటి ముందు రహదారి పైన ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్ రెడ్డి, శేఖర్ కూర్చి వేసుకుని కూర్చున్నారని వీరితో పాటుగా చాలామంది కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంటి పైకి రాళ్లు విసిరారు. సరిగ్గా నేను ,ఎమ్మెల్యే గంగావతి  వచ్చే సమయంలోనే సతీష్ రెడ్డి భద్రత సిబ్బంది కాల్పులు జరిపారని, బిజెపి ప్రభుత్వంలో రూ .8 కోట్లతో వాల్మీకి భవనాన్ని నిర్మించారు.. ఇప్పటికే ఈ విగ్రహం ప్రతిష్టించిన మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని అభివృద్ధి చేయలేకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

ఈ విషయం పైన నారా భరత్ రెడ్డి మాట్లాడుతూ.. వాల్మీకి విగ్రహం  ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తున్నప్పటికీ ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఇలాంటి ఘర్షణకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం పైన చట్టపరంగా ముందుకు వెళ్తామంటూ భరత్ తెలియజేశారు. ఈనెల మూడవ తేదీన మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ ఉన్నది ఈ సందర్భంగా ఊరంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు సైతం ఫ్లెక్సీలు కడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు కూడా ఈ ఫ్లెక్సీలు కడుతూ ఉండడంతో అభ్యంతరాలు చెప్పారని, ఈ విషయం పైన ఎమ్మెల్యే భరత్ సన్నిహితుడు సతీష్ రెడ్డి అక్కడికి చేరుకొని వీరంగం సృష్టించారని వినిపిస్తోంది. ఈ ఘటన తర్వాత తనకు తప్పిన ప్రమాదం గురించి గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనను చంపేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఇలాంటి పని చేశారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: