ఎన్టీఆర్ మొదటి సినిమా రెమ్యూనరేషన్.. ఎంతో తెలిస్తే షాకే సుమీ?

praveen
ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు తమ మొదటి సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అభిమాన హీరో చిన్నప్పటి లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.  కాగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా తన నటనతో డాన్సులతో నిరూపించుకున్నాడు. తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

 ఇక ఎన్టీఆర్ ను ప్రస్తుతం నటనకు నిలువెత్తు రూపం అని తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఒక్కో సినిమాకి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన చూడాలని ఉంది అనే సినిమాకు ఎన్టీఆర్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంత అనే విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నూనూగు మీసాలు వస్తున్న సమయంలోనే ఈ హీరో గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.

 21 ఏళ్లకే సింహాద్రి సినిమా తో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు అన్న విషయం తెలిసిందే. 2001 లో నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాకంటే ముందే 1997 లో బాలరామాయణం అనే సినిమా తీయగా ఇందులో ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమాలోనే తన నటనతో ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును కూడా దక్కించుకున్నాడు. అయితే నిన్ను చూడాలని సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే  నాలుగు లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారట. ఆ డబ్బు ఏం చేయాలో తెలియక అమ్మ చేతిలో పెట్టాడట ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: