కృతి శెట్టి కోసం విశాల్ అంతగా చేస్తున్నాడా..?

shami
ఉప్పెన భామ కృతి శెట్టి ఇప్పుడు గోల్డెన్ లెగ్ అని చెప్పొచ్చు. ఆమె తెలుగులో ఇప్పటివరకు చేసిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రాబోతున్న రాం ది వారియర్ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. తెలుగు, తమిళ భాషల్లో ది వారియర్ భారీగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా లో కృతి శెట్టి విజిల్ కూడా నెర్చేసుకుంది. పందెంకోడి సినిమాతో మీరా జాస్మిన్ కి క్రేజ్ వచ్చినట్టుగా తమిళంలో మొదటి సినిమాగా ది వారియర్ తో కూడా కృతి శెట్టికి అంతే క్రేజ్ వస్తుందని అంటున్నారు.
లింగుసామి ఆమె పాత్రని కూడా చాలా ఇంప్యాక్ట్ తో రాసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా కృతి శెట్టి ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి నితిన్ మార్చర్ల నియోజకవర్గం కాగా.. మరోటి సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ రెండు సినిమాలు కూడా క్రేజీగా వస్తున్నాయి. తప్పకుండా వీటితో కూడా కృతి శెట్టి హిట్ కొడుతుందని అనుకోవచ్చు. ఇలా వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తమిళంలో సూర్యతో ఓ సినిమా ఛాన్స్ అందుకుందన్న విషయం తెలిసిందే.
సూర్య సినిమా పూర్తి కాకుండానే అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందట. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో కృతి శెట్టి నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందట. అయితే అమ్మడు ఆల్రెడీ వేరే సినిమాకు కమిట్ అవడంతో ఆ సినిమాకు పనిచేయడం కుదరట్లేదట. అయినా సరే హీరో విశాల్ అండ్ టీం తమ సినిమాలో కృతి శెట్టి ఉండాలనే ఉద్దేశంతో ఆమెకు వీలున్నప్పుడే డేట్స్ ఇవ్వమని అడిగారట. ఆమెకు కుదిరినప్పుడే సినిమా షూటింగ్ షెడ్యూల్ పెట్టుకుందామని అన్నారట. దానితో కృతి శెట్టి కూడా ఆ మూవీకి ఒప్పుకుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కృతి శెట్టి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: