5 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని కోట్ల లాభాలను సాధించిన 'విక్రమ్' మూవీ..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో విజృంభించిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతాన్ని అందించాడు. జూన్ 3 వ తేదీన తమిళ ,తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయిన విక్రమ్ సినిమా విడుదలయిన అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బస్టర్  టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.

ఇప్పటి వరకు 5 వారాల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అందులో భాగంగా విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు సాధించింది. విక్రమ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ లను గమనించినట్లయితే...


నిజాం : 7.25 కోట్లు , సీడెడ్ : 2.33 కోట్లు , యూ ఎ : 2.51 కోట్లు , ఈస్ట్ : 1.29 కోట్లు , వెస్ట్ : 84 లక్షలు , గుంటూర్ : 1.19 కోట్లు , కృష్ణ : 1.45 కోట్లు , నెల్లూర్ : 61 లక్షలు .
5 వారాలకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ మూవీ 17.47 కోట్ల షేర్ , 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.47 కోట్ల షేర్ , 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన  విక్రమ్ సినిమా 9.97 కోట్ల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: