"కాళీమాత సిగరెట్" పోస్టర్... మహిళా డైరెక్టర్ చేస్తోంది సరైనదేనా ?

VAMSI
రెండు మూడు రోజులుగా ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఒక మహిళా తమిళ డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ లేదా వెబ్ సిరీస్ తీయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా షూట్ జరుగుతున్న క్రమంలో... సందర్భానుసారంగా అందులో కాళీమాత వేషంలో ఉన్న ఒక పాత్రధారిణి సిగరెట్ తాగుతుండే పోస్టర్ ను డైరెక్టర్ రిలీజ్ చేసింది. ఇక అప్పటి నుండి ఈ విషయంపై హిందూ సంఘాలు సదరు మహిళ డైరెక్టర్ పై ద్వజమెత్తారు. మా హిందూ మతం మనోభావాలు దెబ్బతింటాయి అంటూ నానారభస చేస్తున్నారు. ఆ డైరెక్టర్ పేరు లీనా మణిమేకలై అని తెలుస్తోంది. ఈమె కాళీమాతను అవమానించిందని పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అంతే కాకుండా ఈమె అందరికీ క్షమాపణ చెప్పాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఒక వైపు జరుగుతోంది..  అయితే దీని గురించి లీనా మణిమేకలై  ఏమీ స్పందించలేదు. కాగా మరో పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సమాధానాన్ని చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ లో శివుడు మరియు పార్వతి ల వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగుతున్నారు. అయితే ఒకవైపు మొదటి పోస్టర్ రిలీజ్ చేసినందుకే ఇంత గొడవ జరుగుతూ ఉంటే... మళ్లీ మరొక పోస్ట్ ను చేయడం ఎంతవరకు కరెక్ట్ ? దీని వెనుక లీనా మణిమేకలై ఉద్దేశ్యం ఏమిటి ? అంటూ పలువురు తలలు పీక్కుంటున్నారు. అయితే ఈమె ఉద్దేశ్యం ఇది అయి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
దేవుళ్ళ రూపాలు వేరు వేరైనా... దేవుడి ఒక్కడే మరియు దేవుడి మీద ఉన్న భక్తి, ప్రేమలో మాత్రం తేడాలు ఉండవు. అది హిందువు అయినా, ముస్లిం అయినా లేదా క్రిస్టియన్ అయినా.. వారి వారి దేవుల్లపై భక్తి ఉంటుంది. నిజంగా దేవుని గురించి తెలిసిన వారు ఎవరైనా వేరొక దేవుడిని కించపరచరు లేదా అవమనపరచరు. ఇక్కడ లీనా మణిమేకలై చేసింది కూడా ఒక పాత్ర అని మీరు గుర్తు ఎరగండి. ఒక సినిమా, షార్ట్ ఫిల్మ్ లేదా వెబ్ సీరీస్ ఏదైనా మనము పాత్రలను కల్పించకుంటాము.. అంత మాత్రాన అన్ని విషయాలను మనము ప్రశ్నించలేము. కాబట్టి ఈ విషయం గురించి ఇక వివాదాలు ఆపండి అన్నది చాలా మంది అభిప్రాయం. కాగా లీనా మణిమేకలై పోస్ట్ చేసిన రెండవ పోస్ట్ కు మాత్రం సరైన అర్దం... ఇంకా ఎందరో దేవుళ్ళ లాగా అలకరించుకుని ఇలాంటి పనులు చేశారు... చేస్తున్నారు.... చేస్తూనే ఉంటారు అని సో కాల్డ్ వారికి తెలియచేయడానికి ఇది పెట్టింది అని తెలుస్తోంది. తను ఇది పెట్టడం తప్పే అయినా తన ఉద్దేశ్యం అర్దం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: