అలాంటి జోనర్ సినిమాలలో నటించాలని ఉంది... రాశి ఖన్నా..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు పైన రాశి కన్నా గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా ఇప్పటికే తెలుగు , తమిళ , హిందీ భాషల ప్రాజెక్ట్ లలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అందులో భాగంగా తాజాగా రాశి కన్నా తెలుగులో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇదివరకే మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే గోపీచంద్ సరసన కూడా రాశి కన్నా ఇదివరకే జిల్ సినిమాలో నటించింది. ఇలా ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ జులై 1 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి కన్నా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. 

తాజా ఇంటర్వ్యూలో భాగంగా రాశి కన్నా మాట్లాడుతూ ... ఇప్పటివరకు నా కెరీర్ లో నేను రొమాన్స్ , కామెడీ , లవ్ పాత్రలను చేస్తూ వచ్చాను. యాక్షన్ మరియు మైథలాజికల్ స్టోరీస్ సినిమాల్లో కూడా నటించాలని ఉంది. అలాగే  ప్రేక్షకులు ఆదరిస్తారు అనిపిస్తే ప్రయోగాత్మకమైన సినిమాల్లో కూడా నటించడానికి నేను రెడీ అని రాశి కన్నా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి కన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... తెలుగులో రాశి కన్నా నటించిన థాంక్యూ సినిమా జులై 22 వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే రాశి కన్నా తమిళంలో కార్తి హీరోగా నటిస్తున్న సర్దార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా రాశి కన్నా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: