'ది వారియర్' మూవీ లోని 'కలర్స్' సాంగ్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అదే ఈ మూవీ లో రామ్ పోతినేని మొట్ట మొదటి సారి తన కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ కి తమిళ క్రేజీ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించాడు.
 

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ది వారియర్ చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా అందులో నుండి బుల్లెట్ మరియు విజిల్ సాంగ్ లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. తాజాగా సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ది వారియర్ మూవీ లోని 'కలర్స్' అనే లిరికల్ సాంగ్ ను జులై 6 వ తేదీన సాయంత్రం 7 గంటల 21 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  

ఈ పోస్టర్ లో రామ్ పోతినేని ఒంటి నిండా రంగులు పూసుకుని కలర్ఫుల్ గా ఉన్నాడు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా , ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: