'ది వారియర్' ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఈ సినిమాను జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా నుండి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా అందులో నుండి బుల్లెట్ మరియు విజిల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  అలాగే ఈ సినిమా టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను గమనించినట్లు అయితే ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ లో రామ్ పోతినేని , ఆది పినిశెట్టి మధ్య వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

అలాగే ఈ ట్రైలర్ లో రామ్ పోతినేని తన డైలాగ్ లతో , మాస్ ఆటిట్యూడ్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఇప్పటికి వరకు చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్ లు ఇలా అన్నింటికీ ప్రేక్షకులనుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు ఫ్యాన్సీ అమౌంటు కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: