మంచు వారి నుండి మరొక ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్..!!

Divya
మంచు ఫ్యామిలీ నుండి మరొక సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుసగా మంచు విష్ణు మోహన్ బాబు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదలయ్యాయి.. ఇక అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాలను రూపొందించారు. ఈ సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి..ఇప్పుడు మంచు లక్ష్మి సినిమా త్వరలోనే ఒకటి విడుదల కాబోతోంది. మొదటిసారిగా తన తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు లక్ష్మి నటిస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలో ఈ సినిమా పైన భారీగా ఆసక్తి నెలకొంది.

మంచు లక్ష్మి తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు ఈ సినిమా టైటిల్ అగ్ని నక్షత్రం అని టైటిల్ ని తయారు చేసినట్లుగా ప్రకటిస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. నటిగా ఎన్నో సినిమాలలో నటించడంతోపాటు, ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది మంచు లక్ష్మి మొదటిసారిగా ఈ చిత్రంలో తన తండ్రితో కలిసి నటించబోతోంది ఈ నేపథ్యంలో ఈమె చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది. తాను అనుకున్న డ్రీమ్ త్వరలోనే నెరవేరబోతున్నట్లుగా ఆమె తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేసింది తన తండ్రితో కలిసి నటించడం ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటానని తెలిపింది.

ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించిన వీడియోలో మాత్రం ఒక పోలీస్ వ్యాన్ మరియు క్రైమ్ సీను చూపించడం జరుగుతుంది. కనుక ఈ సినిమా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉండబోతుందని చెప్పవచ్చు. అయితే మీ సేవలో తండ్రి కూతుర్ల కనిపిస్తారా ఇద్దరు కూడా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారా అనే విషయం మాత్రం చాలా సస్పెన్స్ గా ఉన్నది. ఈ సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించే అవకాశం రావడం కాకుండా మంచు లక్ష్మి ఈ సినిమాను నిర్మించే అవకాశం కూడా వచ్చిందని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: