'జబర్దస్త్ లో నన్ను వాడుకొని వదిలేశారు'.. అప్పారావు షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కామెడీ షో జబర్దస్త్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ షో  ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక  ఇప్పటికీ ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగునిస్తోంది.అయితే కెరియర్ పరంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండుతెరపై ఏలుతున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. పోతే జబర్దస్త్లో మనకు కనిపించే స్కిట్లు మాత్రం నవ్వులు పూలు పూయిస్తూ ఉంటాయి. అయితే ఇక  వారు అలా చేయడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు.

ఇకపోతే జబర్దస్త్ లో ఉన్న వారంతా వారి జీవితం వైభవంగానే ఉంటుంది కానీ ఒకసారి జబర్దస్త్ షో ని వీడాక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొంతమంది సినిమాలలో అవకాశాలు రావడంతో పరవాలేదు అనిపించినా.. మరి కొంతమందికి మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో కమెడియన్ అప్పారావు కూడా ఒకరు.కాగా  అప్పారావు మంచి మంచి స్కిట్ లు చేయడంతో కొన్ని రోజులకు టీం లీడర్ కూడా అయ్యారు. అయితే ఇక ఏనాడు కూడా పారితోషికం ఇంత కావాలి అని డిమాండ్ చేయలేదట అప్పారావు. పోతే  ఆ షోల కోసం ఎన్నోసార్లు సినిమా అవకాశాలను కూడా వదులుకున్నానని తెలియజేశారు.అంతేకాకుండా  సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని.. వారి యొక్క అవసరం తీరాక జబర్దస్త్ వాళ్ళు వారిని వదిలేస్తున్నారని అప్పారావు తెలియజేయడం జరిగింది.

పోతే  షో లో స్కిట్ కి ఎంత రేటింగ్ వస్తుందో దాన్ని బట్టి ఆ టీం కి రెమ్యునరేషన్ ఇస్తూ ఉండేవారని తెలిపారు. అయితే చమ్మక్ చంద్ర ఉన్నప్పుడు తనకు బాగా పేమెంట్ వచ్చేది అని ఆ తరువాత సుదీర్ టీమ్, ఆది టీమ్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తోంది అని తెలిపారు. పోతే స్కిట్ విన్నర్ అయిన తరువాత వచ్చే డబ్బులను టీం లీడర్ తీసుకుంటాడని.. అయితే ఇక అదంతా పంచకుండా కేవలం స్కిట్టు ముందు ఎంత అయితే పేమెంట్ చెప్పి ఉంటారు అంతే ఇస్తారని .. కానీ మల్లెమాలవారు పేమెంట్ పెంచడమే కానీ తగ్గించడం చాలా తక్కువ అని తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: