'మా' అధ్యక్షుడు ఆ నిర్మాతను మోసం చేశాడా ?

VAMSI
డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఇండస్ట్రీలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో అన్నది తెలిసిందే. అయితే ఆ మార్క్ రీచ్ కాలేకపోయారు ఆయన కుమారులు అన్నది అంతా అంటున్న మాట. నిజమే మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నప్పటికీ ఊహించిన స్థాయిలో వీరికి బజ్ క్రియేట్ కాలేదు అన్నది నిజం. సినీ బ్యాగ్రౌండ్, టాలెంట్, అభినయం, మంచి ఆహార్యం అన్ని పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకో కానీ వీరికి తండ్రి స్థాయిలో ఆదరణ లభించలేదు. ఢీ వంటి ఘన విజయం తర్వాత మంచు విష్ణు వర్ధన్ కెరియర్ యుటర్న్ తీసుకుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటి మ్యాజిక్ ఏమి జరగలేదు.
ఈ మధ్య కాలం లో మంచు విష్ణు చేస్తున్న చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇటీవల ఈ హీరో నుండి వచ్చిన మోసగాళ్ళు చిత్రం కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి  యావరేజ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ నిర్మాత మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు నాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన మరెవరో కాదు ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన రామ సత్యనారాయణ. ఈయన హీరో విష్ణు గురించి  చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. రామ సత్యనారాయణ మాట్లాడుతూ నేను ఏ వ్యాపారం చేసినా అంతటా విజయమే అందుకున్నాను. ఒక్క సినిమాల విషయం లో తప్ప....నిజంగా సినిమాల విషయం లో నేను చాలా మోసపోయాను అంటూ హాట్ కామెంట్స్ చేసారు.  
నేను వెధవను కాబట్టి మోసపోయానని, మోసగించారని ఆయన అన్నారు. నేను కోడి రామకృష్ణ స్కూల్ మేట్ అలా నాకు ఈ సినిమా అనే జబ్బు కాస్త అంటుకుందని ఇపుడు నిండా మునిగాక ఎలా వదిలించుకోవాలి అని చూస్తున్నాను చెప్పుకొచ్చారు. 2003లో నాకు సినిమాను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది... దాంతో రామరాజ్యం అనే చిత్రానికి తాను 5 లక్షలు ఇచ్చి మరి సమర్పకుడిగా పేరు వేయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే సమర్పకుడు అంటే నిర్మాతతో సమానం అని అనుకున్నానని కానీ  సమర్పకుడు అంటే డబ్బులు పోగొట్టుకునే వ్యక్తి అని ఆ తర్వాత కానీ అర్దం కాలేదు అని అన్నారు.
అన్ని చేసిన ఆ సినిమా రిలీజ్ కాలేదని ఆయన చెప్పారు. 1977లో టైం లో అంతా పోయి 15000 రూపాయలు చేతిలో మిగిలిందని ఇక తప్పక తన 2,000 రూపాయలకు ఉద్యోగంలో చేరాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత థియేటర్ ను కూడా స్టార్ట్ చేసాను అని 'ఊహ' అనే సినిమాతో బాగా లాభాలు వచ్చాయని అన్నారు. ఆ తరవాత మంచు విష్ణుకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆ డబ్బులు ఇప్పటివరకు వెనక్కి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా మంచు విష్ణు తనకి 5 లక్షలు రూపాయలు బాకీ ఉన్నాడు అన్నట్లుగా చెప్పుకొచ్చారు సత్యనారాయణ. మరి సదరు నిర్మాత చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజ ఉందనేది తెలియాలంటే విష్ణు మాట్లాడితే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: