పూరి జగన్నాథ్... విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూడో సినిమా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో అదిరిపోయే బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరుగా కొనసాగుతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరిగా పూరి జగన్నాథ్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా, అదిరిపోయే కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా కనిపించబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ జనగణమన అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది.

లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అవగానే జనగణమన సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మూడో సినిమా కూడా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. జనగణమన సినిమా చివరి దశకు వచ్చే సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా ప్రారంభం కాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో పేట వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: