రామ్ పోతినేని 'ది వారియర్' ట్రైలర్ లాంచ్ వేదిక ఖరారు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెడ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తర్వాత ది వారియర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా,  ఈ సినిమాకు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా అందులో నుండి బుల్లెట్ మరియు విజిల్ సాంగ్ లు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ వ్యూస్ ని సాధిస్తూ ముందుకు దూసుకు పోతున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టీజర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ ను జులై 1 వ తేదీన సాయంత్రం 7 గంటల 57 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదికను కూడా డిసైడ్ చేసింది. మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనంతపూర్ ,  అనంతలక్ష్మి  ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ వేడుక జరగనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించగా , అక్షర గౌడ , నదియా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: