రామ్ పోతినేని 'ది వారియర్' మూవీలోని 'విజిల్' సాంగ్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అయిన బుల్లెట్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ది వారియర్ మూవీ లో నుండి విజిల్ అనే లిరికల్ వీడియో సాంగ్ ను  కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ విడుదల అయినప్పటి నుండి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకొని ఇప్పటికే 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ని సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ ను తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేశారు. రెండు భాషల్లో కూడా ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో రేపు అనగా జూలై 1 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కెరియర్ లో మొట్టమొదటి సారి ది వారియర్ మూవీ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: