హిట్ ఇచ్చిన హీరోకి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ఖరీదు ఎంతో తెలుసా..?

Anilkumar
ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాలు సరైన హిట్లు లేక అల్లాడిపోతున్నారు. ఇక ఇలాంటి సమయంలో తాజాగా  బాలీవుడ్ ఇండస్ట్రీకి భూల్‌ భులాయా 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు.అయితే సరైన హిట్ లు లేకుండా అల్లాడిపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకు ఈ సినిమా ఆక్సిజన్ అందించినట్లుగా అయ్యింది.ఇక  ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికీ వరకు దాదాపుగా 184.32 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.ఇకపోతే  ఈ సినిమా విడుదల అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.

అయితే భూల్‌ భులాయా 2 సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడంతో ఆ సినిమా దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఆనందంలో నిర్మాత భూషణ్‌ కుమార్‌ హీరో కార్తీక్ ఆర్యన్ కు అత్యంత ఖరీదైన బహుమతిగా ఇచ్చాడు. అంతేకాక మెక్‌లారెన్‌ జీటీ అనే స్పోర్ట్స్‌ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇకపోతే ఆ స్పోర్ట్స్ కారు ఖరీదు దాదాపు రూ.4.7 కోట్లు ఉంటుందని అంచనా. అంతేకాక ఇండియాలో ఈ కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా కార్తీక్‌ ఆర్యన్ నిలిచాడు.ఇక కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు.ఇకపోతే నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్‌ జీటీ యజమానిని.

పోతే  నెక్స్ట్‌ టైం ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌ అంటూ కారు ముందు దిగిన ఫొటోలను కార్తీక్‌ ఆర్యన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అంతేకాకుండా అతడికి ఇదివరకే మినీ కూపర్‌, లంబోర్గిని ఉరుస్‌ కార్లు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే  నిర్మాత అంత ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇవ్వడంతో కార్తీక్ ఆర్యన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అయితే కార్తీక్‌ ఆర్యన్‌, నిర్మాత భూషణ్‌ కుమార్‌ల మధ్య ఆప్యాయత ఇప్పటిది కాదు.ఇకపోతే  2018లో సోనూకీ టీటుకీ స్వీటీ సినిమాతో వీరి కాంబినేషన్‌ మొదలైంది అన్న విషయం తెలిసిందే.ఇక  ప్రస్తుతం భూల్‌ భులాయా 2 సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: