హీరో మాధవన్ "రాకెట్" ప్రయోగం ఫలిస్తుందా ?

VAMSI
కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తెలుగులోను ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెలి, సఖి వంటి సూపర్ హిట్ చిత్రాలతో యువత మనసును తన వైపుకు తిప్పుకున్న ఈ హీరో ఆ తరవాత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత విలన్ గా కూడా మారి సవ్యసాచి వంటి పలు సినిమాల్లో అలరించారు. నటుడిగా ఎంతో అనుభవం ఉన్న మాధవన్ ఇపుడు మెగా ఫోన్ కూడా చేత పట్టేశాడు. దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. రాకెట్రి అనే సినిమాకి ఓ వైపు దర్శకుడిగా చేస్తూనే మరో వైపు ఆ చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఓ సైంటిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. కరోనా పాండమిక్ నడుమ నలిగిపోతు జులై 1న ఈ సినిమా విడుదల కానుంది.
దర్శకుడిగా మొదటి సారి ట్రై చేస్తున్న మాధవన్ సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని టీం చెబుతున్నారు.
ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చరిత్రలోనే ఇది ఒక వింత కథ. చేయని తప్పుకు ఒక శాస్త్రవేత్త జైలు జీవితం గడుపుతాడు. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. కానీ మాధవన్ దర్శకుడిగా స్క్రీన్ ప్లే ఎలా చేశాడు ఆనంది ఇక్కడ ముఖ్యం. కాసేపటి క్రితమే విడుదలైన ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఈ అంచనాలు అన్నీ అందుకుని సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి అంటే... మరో వరం రోజుల్లో ఇది థియేటర్ లో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: