మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో కలెక్షన్ కింగ్..?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది చాలాసార్లు చర్చించుకున్నట్లు త్రివిక్రమ్‌ సినిమాలో ఓ సీనియర్‌ హీరో/ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌..మరియు ఓ సీనియర్‌ నటి ఉండాల్సిందే. ఇక గత కొన్ని సినిమాలుగా ఇదే జరుగుతూ వస్తోంది.అయితే తాజాగా ఈ క్రమంలో మహేష్‌బాబుతో త్వరలో చేయబోయే సినిమాలో కూడా ఇలానే సీనియర్‌ నటులు ఉంటారని వార్తలొస్తున్నాయి. ఇకపోతే వాళ్లు, వీళ్లు అని పేర్లు వినిపిస్తున్నాయి కానీ, ఎవరూ ఇంకా ఓకే అవ్వలేదు అంటున్నారు. ఇదిలావుంటే తాజాగా ఇప్పుడు  ఈ లిస్ట్‌లో మరో పేరు బయటకు వచ్చింది.

ఇకపోతే తాజాగా  మహేష్‌బాబు 28వ సినిమాగ రూపొందనున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు నటిస్తారని ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఆమెకు జోడీగా శోభన నటిస్తారని సమాచారం.అంతేకాక  'అల్లుడుగారు'లో ఈ జంట చేసిన సందడి అంతా ఇంతా కాదు.ఇక ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలసి నటించినా.. ఆ సినిమాలో వారి కెమిస్ట్రీ అదిరిపోతుంది అని చెప్పాలి. తాజాగా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి ఈ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు.అయితే జూలై నెలాఖరు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కాగా ఈ సినిమాకు 'పార్ధు', 'అర్జునుడు' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

అంతేకాదు అలాగే శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. ఇక మోహన్‌బాబు పాత్ర అంటే  మినిమం ఉండాలి అంటారు.ఇక అందుకు తగ్గట్టుగా ఈ కారెక్టర్‌ను త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం.కాగా  మహేష్, మోహన్ బాబు మధ్య జరిగే సన్నివేశాలు అదిరిపోతాయని సినిమా సన్నిహితుల కామెంట్‌.ఇదిలావుంటే మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తారని తొలుత వార్తలొచ్చాయి.తాజాగా ఇప్పుడు సంక్రాంతి బరి నుండి సినిమా తప్పుకున్నట్లే అంటున్నారు. ఇకపోతే జులైలో మొదలుపెడితే సంక్రాంతికి విడుదల చేయడం అంత ఈజీ కాదని టీమ్‌ భావిస్తోందట.ఇక అందుకే ముందస్తుగానే సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నారని టాక్‌.అయితే  ఆ లెక్కన సినిమా 2023లో సమ్మర్‌లో వస్తుందని చెప్పొచ్చు. కాగా చూద్దాం గురూజీ ఆలోచనలు ఎలా ఉన్నాయో.ఇకపోతే ఈ సినిమా  వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి వచ్చేసినా ఆశ్చర్యం లేదు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: