ది వారియర్ : మరో మాస్ సాంగ్ తో రామ్ రచ్చ రంబోలా!

Purushottham Vinay
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ది వారియర్". తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ బాగా జోరుగా సాగుతున్నాయి.ఇక ఇప్పటికే 'ది వారియర్' మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బుల్లెట్' సాంగ్ యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియాలో ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది. మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను బాగా షేక్ చేసింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో డ్యాన్స్ నంబర్ 'విజిల్ సాంగ్' తో కూడా వచ్చారు.అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా వేదికగా విజిల్ పాటను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.ఇక 'నాలికిట్టా మడతపెట్టి.. వేళ్లు రెండు జంట కట్టి.. ఊదు మరి ధమ్మే బట్టి.. విజిల్.. విజిల్.. విజిల్' అంటూ సాగిన ఈ సాంగ్ మాస్ ని చాలా విపరీతంగా అలరిస్తోంది.ఇందులో రామ్ పోతినేని మాస్ లుక్స్ ఇంకా అలాగే అతని డ్యాన్స్ మూవ్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇక రాపో పోటెన్సియల్ అండ్ ఎనర్జీకి అనుగుణంగా జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. కృతి శెట్టి కూడా రామ్ తో పోటీగా కాలు కదపడానికి చాలా ట్రై చేసింది.


కృతి శెట్టితో రాపో వేసిన హుక్ స్టెప్స్ మాస్ ని బాగా అలరిస్తోంది.అలాగే విజువల్ గానూ ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా ఉంది.ఇంకా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ కు ఆంథోనీ దాసన్ ఇంకా శ్రీనిషా జయ సీలన్ వాయిస్ అదనపు అసెట్ గా నిలిచింది. అలాగే సాహితీ ట్యూన్ కు తగ్గట్టుగా లిరిక్స్ అందించింది.ఇక ఈరోజు 'ది వారియర్' మొత్తం టీమ్ మరియు మీడియా సమక్షంలో AMB సినిమాస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో మేకర్స్ 'విజిల్' పాటను లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని 2022 జూలై 14 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపించనున్నారు. అలాగే అక్షర గౌడ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా.. ఇంకా ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ రోల్ ప్లే చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: