జిన్నా : విష్ణు కోసం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్!

Purushottham Vinay
ఎన్నో ప్లాపుల తరువాత విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇక ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ అనేది కూడా సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్ ఇంకా అలాగే సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ఇంకా అలాగే రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే స్టార్ కోరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా ఇంకా అలాగే బాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'జిన్నా' సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ ఇంకా అలాగే సన్నీలియోన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పార్టీ సాంగ్ కి గణేష్ ఆచార్య అదిరిపోయే స్టెప్స్ ని సమకూర్చారు. ఇక ఎంగేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న మంచి అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ప్రభుదేవా ఇంకా అలాగే గణేష్ ఆచార్య తో పాటు ఈ సినిమా కోసం డ్యాన్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా లీడ్ పెయిర్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ పాటకు కొరియోగ్రఫీని అందించారు.


'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాట కోసం డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన స్టెప్స్ కి దేశావ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రముఖ డ్యాన్సర్స్ 'జిన్నా' పాటలకు కూడా కొరియోగ్రఫీ సమకూర్చడం సినిమాపై భారీ అంచనాలు బాగా పెరిగేలా చేసాయి. ఇక డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ ఇంకా అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ ఇంకా స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను ఇంకా నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. అలాగే జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: