అందరూ నయనతారలా ఉండాలంటే కుదురుతుందా : ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఐశ్వర్య భాస్కరన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈమె సీనియర్ హీరోయిన్ లక్ష్మి కూతురు అన్న విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి. ఇక ఐశ్వర్య భాస్కరన్ నటిగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 200 సినిమాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండేది. క్యారెక్టర్ల లో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది ఐశ్వర్య. అయితే ఒకప్పుడు స్టార్ గా రాణించిన వారు ఆ తర్వాత కుప్పకూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిలో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ఒకరని చెప్పవచ్చు.
ఒకప్పుడు వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు తినడానికి తిండి కోసం ఇంటింటికి వెళ్లి సబ్బులు అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె హీరోయిన్గా నటించిన తర్వాత అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చానని తెలిపింది. ఇక వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. ఇకపోతే ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదు అని తప్పని పరిస్థితుల్లో ఏ పని చేయడానికైనా తాను ఆలోచించను అని కూడా చెప్పుకొచ్చింది.
ఇకపోతే అందరి జీవితాల్లో సినీ ప్రపంచం ఆనందాన్ని నింపదు అని.. హీరోయిన్ గా నయనతార లా అందరికీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా బాగా జరగాలి అంటే .. ప్రతి ఒక్కరి జీవితం అలా ఉండాలి అంటే కుదరదు.. ఆమె అదృష్టానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటూ తెలిపింది  ఇక ఐశ్వర్య జీవితంలో ఎదగడానికి పాచి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇకపోతే తన కాళ్ళపై తాను నిలబడి స్వశక్తితో జీవించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: