నాని సినిమా రీమేక్ 'నికమ్మ' చెత్త రికార్డ్!

Purushottham Vinay
తెలుగులో సక్సెస్ అయింది కదా అని నాని చిత్రం 'ఎంసీఏ' సినిమాను గుడ్డిగా హిందీలో రీమేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది చిత్ర బృందం. నాని మంచి ఊపులో ఉన్నప్పుడూ బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి 'ఎంసీఏ' పెద్ద హిట్టయింది కానీ నిజానికి అది చాలా సాధారణమైన సినిమా. చెత్త రొటీన్ కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాని ఫిల్మోగ్రఫీలో చాలా దిగువన పెట్టాలనే చెప్పాలి. అలాంటి సినిమాను రీమేక్ చేసి తల బొప్పి కట్టించుకున్నాడు బాలీవుడ్ దర్శక నిర్మాత అహ్మద్ ఖాన్.హిందీలో అభిమన్యు దాసాని కథానాయకుడిగా 'నికమ్మ' పేరుతో 'ఎంసీఏ' సినిమా రీమేక్ అయింది.సాయిపల్లవి పాత్రను షెర్లీ సెటియా ఇంకా భూమిక క్యారెక్టర్ని శిల్పా శెట్టి చేశారు హిందీలో. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే చాలా పేలవంగా అనిపించింది. అందువల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది ఈ సినిమా గురించి. ఐతే పాపం సినిమా తీశారు కాబట్టి జనాల్లోకి తీసుకెళ్లాల్సిందే అని.. శిల్పా ఇంకా అలాగే అభిమన్యు కలిసి గట్టిగా ప్రమోట్ చేశారు.

కానీ శుక్రవారం నాడు విడుదలైన 'నికమ్మ' పబ్లిసిటీ కోసం పెట్టిన ఖర్చును కూడా పాపం రాబట్టలేకపోయింది.దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.25 లక్షలు మాత్రమే. ఇక విమర్శకులు అయితే ఈ సినిమాను చీల్చి చెండాడారు. ప్రేక్షకులు సైతం సినిమాను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక సినిమా పుంజుకునే అవకాశాలు లేనట్లే అని చెప్పాలి. ఫుల్ రన్లో కోటి రూపాయలు వసూలు కావడం కూడా చాలా కష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇదెంత పెద్ద డిజాస్టరో మనం అర్థం చేసుకోవచ్చు. 'జెర్సీ' లాంటి క్లాసిక్‌ను రీమేక్ చేస్తేనే పట్టించుకోని హిందీ ప్రేక్షకులు ఇక 'ఎంసీఏ' లాంటి రొట్ట రొటీన్ సాధారణ చిత్రాన్ని హిందీలో తీస్తే ఎలా హిట్ చేస్తారు మరి? ఇక ఏదైనా నానివి వరుసగా రెండు సినిమాలు ఈ సంవత్సరం బాలీవుడ్ లో రీమేక్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇది వారికే కాదు నానికి కూడా చెత్త రికార్డు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: