టీజర్:ఈ సినిమాతో ఇద్దరూ గట్టెక్కేరా..?

Divya
యువ హీరో ఆది సాయికుమార్ ప్రేమ కావాలి చిత్రం తో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కానీ ప్రస్తుతం ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా తీన్ మార్ ఖాన్ అనే సినిమాలో నటించి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. స్టూడెంట్ రౌడీ పోలీస్ అనే ట్యాగ్ లైన్ కూడా మనం చూడవచ్చు.
ఈ చిత్రాన్ని కల్యాణ్ జి గొగణ రూపొందించారు. ఇందులో హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ సినిమాని ప్రొడక్షన్ నెంబర్ 3 బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతిరెడ్డి నిర్మించారు. ఇందులో సునీల్ పూర్ణ కూడా కీలక పాత్రలో నటించడం జరుగుతోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఒక నిమిషం 34 సెకన్ల నిడివితో ఈ టీజర్ ను కట్ చేయడం జరిగింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
మొదట ఆఫీసుకు వెళ్లిన మా అన్న తిరిగి రాలేదు అనే విషయంతో ఈ సినిమా టీజర్ మొదలవుతుంది. ఇక ఇందులో ఆది విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా బాగా అదరగొట్టేశాడు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇందులో పాయల్ రాజ్ మరొకసారి తన హద్దులను చెరిపివేసింది అని చెప్పవచ్చు. ఆది సాయి కుమార్ క్యారెక్టర్ ని మూడు రూపాలలో చూపించి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఇక పాయల్, ఆది మధ్య జరిగే రొమాన్స్ ఈ సినిమాకి హైలెట్ గా కనిపిస్తోంది. ఆది యాక్షన్ హీరోగా నిలబెట్టాలని చేస్తున్న ఈ సినిమా మరి ఎంతటి విజయాన్ని అందుకుంటుంది..ఇద్దరి కెరియర్ మారుస్తుందా అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: