రెండు వారాల్లో అన్ని కోట్ల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా సాధించిన 'మేజర్' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.  ఈ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ , శోభితా ధూళిపాళ  కీలక పాత్రలలో  నటించారు.బ్ ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించాడు.  విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న మేజర్ సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3 వ తేదీన విడుదల అయ్యింది.

విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి,  అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం లాభాలను అందుకుంటోంది.  ఇది ఇలా ఉంటే మేజర్ సినిమా ఇప్పటికే విజయవంతంగా రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా రెండు వారాలకు గాను మేజర్ మూవీ సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 8.07 కోట్లు ,
సీడెడ్ : 1.86 కోట్లు ,
యూ ఎ : 2.10 కోట్లు ,
ఈస్ట్ : 1.41 కోట్లు ,
వెస్ట్ : 90 లక్షలు ,
గుంటూర్ : 1.13 కోట్లు ,
కృష్ణ : 1.06 కోట్లు ,
నెల్లూర్ : 67 లక్షలు ,
రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ మూవీ రెండు వారాలకు గాను 17.20 కోట్ల షేర్ , 28.66 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  : 1.96 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో 5.40 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.08 కోట్లు .
రెండు వారాలకు గానూ ప్రపంచవ్యాప్తంగా మేజర్ మూవీ 30.64 కోట్ల షేర్ , 57.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: