కీర్తి సురేష్ నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Divya
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేఘన వారసురాలిగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది కీర్తి సురేష్.. తన నటనతో , అందంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి  సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తొలినాళ్ళ నుంచి అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈమె.. తాజాగా సర్కారీ వారి పాట సినిమాలో గ్లామర్ పాత్రలో  నటించి ఏ పాత్రలో నైనా  నటించగలనని ప్రూవ్ చేసుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషా చిత్రాలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కీర్తిసురేష్ తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో , దసరా సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తూ సక్సెస్ సాధిస్తాననే నమ్మకంతో ఉంది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో సినిమాకు కీర్తిసురేష్ 2.5 కోట్ల రూపాయల నుంచి రూ.3  కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక భారీగా చూసుకుంటే 30 లక్షల రూపాయలను అటుఇటుగా సంపాదిస్తోంది. సినిమా సినిమాకు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ ను  కొనసాగిస్తున్న కీర్తి సురేష్ తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మరికొంతమంది స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని గనుక కీర్తి సురేష్ సొంతం చేసుకుంటే ఈమె ఫేట్ మారిపోవడం గ్యారెంటీ అని అందరూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే కీర్తి సురేష్ చేతిలో ఎక్కువ సినిమా ఆఫర్లు ఉన్నప్పటికీ సక్సెస్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ పడింది . ఇక భవిష్యత్తు ప్రాజెక్టులతో కీర్తి సురేష్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: