12 రోజుల్లో మేజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరైన అడవి శేషు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఇది వరకే అడవి శేషు, శశికిరణ్ తిక్క కాంబినేషన్ లో తెరకెక్కిన గూడచారి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజులో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలా భారీ అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.


నైజాం : 7.99 కోట్లు , సీడెడ్ : 1.84 కోట్లు , యూ ఎ : 2.07 కోట్లు , ఈస్ట్ : 1.40 కోట్లు , వెస్ట్ : 90 లక్షలు , గుంటూర్ : 1.12 కోట్లు , కృష్ణ : 1.03 కోట్లు , నెల్లూర్ : 67 లక్షలు ,
12 రోజులకు గాను మేజర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.02 కోట్ల షేర్ ,  28.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.92 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో 5.10 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.01 కోట్లు .
12 రోజులకు గాను మేజర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 30.05 కోట్ల షేర్ , 56.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు  చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: