11 రోజుల్లో అన్ని కోట్ల లాభాలను సాధించిన 'మేజర్' సినిమా..!

Pulgam Srinivas
అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఆ అంచనాలకు తగినట్లు గానే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. అలా ఈ సినిమాకు భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ కి  ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమాకు దాదాపుగా 18 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములా తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది  . 19 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన మేజర్ సినిమా అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని లాభాలను కూడా అందుకుంది .

11 రోజులకు గాను మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 29.65 కోట్ల షేర్ , 53.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది . దీనితో మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఇప్పటికీ 10.65 కోట్ల లాభాలను అందుకుంది. ఇప్పటికి కూడా మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో మంచి హోల్డ్ ను కనబరుస్తూ మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: