విక్రమ్ వల్ల నితిన్ కి ఎంత లాభమో తెలుసా?

Purushottham Vinay
ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమాపై రిలీజ్ కు ముందు అసలు పెద్దగా అంచనాలు లేవు.అసలు ఆడుతుందో ఆడదో అన్న నమ్మకాలు కూడా తక్కువే. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను టాగోర్ మధు ఇంకా ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ వెంకట్ అలాగే హీరో నాని మేనేజర్ వెంకట్ ఇంకా నితిన్ కొనుగోలు చేశారు. మొత్తం ఆరు కోట్లకు హక్కులను కొనుగోలు చేయగా విడుదలకు ముందే సీడెడ్ ఇంకా ఆంధ్ర హక్కులను 5 కోట్ల రూపాయలకు అమ్మేశారు. నైజాం ఏరియాను మాత్రం వారు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు.ఇక కమిషన్ పద్ధతిలో దిల్ రాజు ఈ సినిమాను నైజాంలో విడుదల చేయగా ఫస్ట్ వీకెండ్ లో నైజాంలో ఈ సినిమా రికార్డు స్థాయిలో 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. అలాగే ఫుల్ రన్ లో నైజాంలో ఈ సినిమా ఐదు నుంచి 6 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సాధించే ఛాన్స్ అయితే ఉంది. నితిన్ ఇంకా నితిన్ తండ్రికి ఈ సినిమా ద్వారా కోటి నుంచి కోటిన్నర వరకు లాభం దక్కనుంది. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం అనేది వస్తుండటంతో నితిన్ ఫ్యామిలీ సంతోషిస్తోందని సమాచారం తెలుస్తోంది.


ఇక ఒక విధంగా కమల్ హాసన్ సినిమా నితిన్ జాతకాన్ని మార్చిందనే చెప్పాలి. హీరోగా కూడా నితిన్ కూడా విజయాలను అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు అనేవి నెలకొన్నాయి. నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఇక కృతిశెట్టి ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే కృతిశెట్టి ఓటేస్తున్నా ఆమెకు తెలుగులో చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. యంగ్ హీరోలు ఇంకా మిడిల్ రేంజ్ హీరోలు కృతిశెట్టిని తమ సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదే మాచర్ల నియోజకవర్గం సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: