సినిమా ఇండస్ట్రీకి శోభన్ బాబు కొడుకు దూరం.. ఎందుకంటే?

Purushottham Vinay
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు శోభన్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్ర సోగ్గాడి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకోవడమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.మరీ ముఖ్యంగా తన అందంతో ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్న శోభన్ బాబు ఆంధ్ర సోగ్గాడు గా గుర్తింపు తెచ్చుకొని అప్పట్లో తన హెయిర్ స్టయిల్ తో సరికొత్త ట్రెండ్ ని కూడా క్రియేట్ చేసి అప్పట్లో ఎంతోమంది యూత్ కి ఫ్యాషన్ మోడల్ గా కూడా నిలిచారు. ఇక సాధారణంగా ఎవరైనా కానీ సినీ ఇండస్ట్రీలో అగ్రతారలుగా కొనసాగుతున్నారు అంటే ఆ తరువాత వారి వారసులను కూడా ఇండస్ట్రీలోకి ప్రవేశింప చేస్తూ ఉంటారు. ఇది ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇంకా అలాగే రామానాయుడు వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.కానీ శోభన్ బాబు మాత్రం తన కొడుకును ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచారు.. ఇక ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ నటుడు అయిన రాజారవీంద్ర వెల్లడించారు.

ఈ విషయం గురించి రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభన్ బాబు గారి దగ్గరకు వెళ్లి మీ కొడుకును ఎందుకు హీరో చేయలేదు అని అడగగా ఇక ఆ సమయంలో శోభన్ బాబు నేను బాగా కష్ట పడుతున్నాను.. ఇక ప్రతి సినిమా విషయంలో కూడా చాలా టెన్షన్ పడతాను అలాగే పెడతాను కూడా ..ఇక ఈ టెన్షన్స్ అన్నీ కూడా నా కొడుకుకి ఎందుకు అని.. శోభన్ బాబు తెలిపినట్టు రాజారవీంద్ర ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఒక రకంగా చూసుకుంటే సినిమాల వల్ల కలిగే టెన్షన్ తట్టుకోలేక శోభన్ బాబు కొడుకు కూడా ఇండస్ట్రీకు దూరంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే ఖచ్చితంగా స్టార్ డం అనేది కావాలి.ప్రస్తుతం శోభన్ బాబు కొడుకు తన తండ్రి ఆస్తులను వారసత్వంగా తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగంలో చాలా బాగా దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: