ఎన్టీఆర్ కి అది సరిగ్గా సూట్ అవుతుందట..!!
అయితే ఈ చిత్రాని కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా యొక్క ప్రభావం ఏమైనా ఈ సినిమా మీద ఉంటుందో అని ఎన్టీఆర్ అభిమానులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే దాని నుంచి కొరటాల బయటకు వచ్చి ఈ సినిమాను హిట్ చేయడం ఖాయమని వారిలో నే ఒక వర్గం కూడా చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది ఈ సినిమా. తప్పకుండా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది అని చిత్ర యూనిట్ చెబుతుండడం విశేషం.
ఈ సినిమా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తో కలసి తన 31వ సినిమాను కూడా చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ సినిమా యొక్క పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో క్లారిటీ ప్రేక్షకులలో వచ్చింది. మరి ప్రశాంత్ ఈ సినిమా కోసం అసురుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నాడని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా నెగటివ్ గా ఉంటుంది అని చెబుతున్న నేపథ్యంలో ఈ పాత్ర ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.