శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి రాకపోవడానికి అసలు కారణమేంటో తెలుసా..?

Anilkumar
శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో  వరుస విజయాలతో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే కథాబలం ఉన్న సినిమాలలో శోభన్ బాబు ఎక్కువగా నటించగా ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇకపోతే ఈయన ఆంధ్రుల అందాల నటుడిగా శోభన్ బాబు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. అయితే రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు సినిమాలపై ఇష్టంతో సినిమాల్లోకి వచ్చారు.ఇక ఉదయం కాలేజ్ కు వెళుతూ మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ తిరుగుతూ శోభన్ బాబు సినిమాల్లో సక్సెస్ కావడం కొరకు ఎంతో కష్టపడ్డారు. 

అయితే ఈయన కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించే అవకాశం రాగా వాటికి ఓకే చెప్పి శోభన్ బాబు సత్తా చాటారు. ఇక వయస్సు పెరిగిన తర్వాత శోభన్ బాబు సినిమాలకు దూరంగా ఉన్నారు. కాగా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును స్థలాలపై ఇన్వెస్ట్ చేసి ఊహించని స్థాయిలో శోభన్ బాబు సంపాదించారు.అయితే ఆ కాలంలో అమ్మాయిలు శోభన్ బాబులా అందంగా ఉండే వ్యక్తి తమకు భర్తగా కావాలని కోరుకునేవారు. శోభన్ బాబు కుటుంబ సభ్యులెవరూ సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు.కాగా  రాజా రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో కావాలని అనుకోలేదని తెలిపారు.

 అయితే హీరోగా తాను నటించిన సినిమాలు సక్సెస్ కాలేదని ఆయన తెలిపారు. ఇకపోతే ఒక సందర్భంలో శోభన్ బాబును మీ కొడుకును ఎందుకు హీరో చేయలేదని అడిగానని రాజా రవీంద్ర తెలిపారు. ఇక ఆ సమయంలో శోభన్ బాబు తాను కష్టపడతానని ప్రతి సినిమా విషయంలో టెన్షన్ పడతానని తన కొడుకు కూడా ఎందుకు టెన్షన్ పడాలని శోభన్ బాబు చెప్పారని శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి రాకపోవడానికి కారణం ఇదేనని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. అంతేకాదు నా కొడుకు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నానని శోభన్ బాబు చెప్పారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: