ఎఫ్-3 సినిమా ప్రమోషన్లు లో పాల్గొన్న బ్రహ్మానందం.. కారణం..!!

Divya
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన కామెడీ చిత్రం f-3 ఈ సినిమా గత నెల 27వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో నిర్మించడం జరిగింది. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ ను ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈసారి వెంకటేష్ ,వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి బ్రహ్మానందం వంటివారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను చాలా యంగ్ నన్ను చూసి అందరూ మా అబ్బాయి అనుకున్నారని.. అంటు బ్రహ్మానందం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. చంటి సినిమాలో తను పోషించిన రేచీకటి పాత్రను ప్రస్తుతం ఈ సినిమాలో వెంకటేష్ గారితో చేయించారని.. ఆయనేమో తనకంటే బాగా నటించారని బ్రహ్మానందం క్లిపింగ్ వేసి మరి చూపించారు. ఆ పాత్ర చేసేటప్పుడు తనకు ఒకసారైనా చెప్పాలి కదా అంటూ అసహనం ప్రదర్శించారు. ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాలో నత్తి పాత్రను పోషించారు. బ్రహ్మానందం కూడా ఆహనా పెళ్ళంట చిత్రంలో ఈ సన్నివేశం చేశానని అదికూడా క్లిపింగ్ వేసి మరీ చూపించారు.

గతంలో కూడా తన ఇలాంటి పాత్రలే చేసినప్పటికి కూడా కొత్తగా చేశావని వారిద్దరిని బ్రహ్మానందం అభినందించారు. అయితే ఆయన స్ఫూర్తితోనే తాము చేయగలిగామని వెంకటేశ్, వరుణ్ తేజ్ తెలియజేయడం జరిగింది. ఇక వెంకటేష్ కి కామెడీ ఎన్నో సినిమాలలో చేసుకుంటూ వస్తున్నారు ఇక వరుణ్ తేజ్ కూడా ఎక్కువగా మాట్లాడడు అలాంటి ఆయనతో కామెడీ చేయించారు.. పాపం వారిని చాలా హింసకు పెట్టార అయ్యా అంటూ బ్రహ్మానందం తెలిపారు. అప్పట్లో కమెడియన్స్ అంత ఎక్కువగా ఎవరికి వాళ్లు బాగా చేసి డైరెక్టర్ తో శభాష్ అనిపించుకోవాలని చూసేవారని తెలిపారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత కమెడియన్స్ మరెక్కడా లేరని కూడా తెలిపారు. కమెడియన్లు లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో కామెడీ ఉంచండి అంటు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: