విక్రమ్ సినిమాలో 'సూర్య' పాత్ర పై అంచనాలు పెంచేస్తున్న చిత్రబృందం..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఆయన సూర్య గురించి తెలుగు సినీ ప్రేమికు లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న సూర్య తెలుగు లో కూడా  స్టేట్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సూర్య, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకొని తెలుగు నాట ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 అలా తమిళ్ తో పాటు తెలుగు లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య తాజా గా కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా,  ఈ సినిమా లో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్  పాత్రలను లను ట్రైలర్ లో చూపించిన చిత్ర బృందం సూర్య పాత్ర కు సంబంధించిన ఎలాంటి ఎలాంటి వివరాలను తెలియజేయలేదు.  కాకపోతే తాజా గా ఈ చిత్ర బృందం సభ్యులు సూర్య పాత్ర పై కొన్ని అనూహ్యమైన వ్యాఖ్యలు చేసి ఈ సినిమాలో సూర్య ఎంట్రీ కి సంబంధించి అంచనాలను పెంచేశారు.

అసలు విషయం లోకి వెళితే... విక్రమ్ చిత్ర బృందం విక్రమ్ సినిమా లో సూర్య ఎంట్రీ మామూలుగా ఉండదు అని,  సూర్య ఎంట్రీ సమయం లో జనాలు చేసే సందడి అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని,  ఇలా సూర్య ఎంట్రీ కి సంబంధించి చిత్ర బృందం అంచనాలను పెంచేస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి వున్న విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: