చరణ్ సినిమా.. ఔట్ డేటెడ్ టైటిల్ తో ఫ్యాన్స్ అప్సెట్..!

shami
ఆర్.ఆర్.ఆర్ లో సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన రాం చరణ్ ఆచార్య లో సిద్ధ పాత్రలో తన వరకు బాగానే చేసినా సినిమా మెగా ఫ్యాన్స్ ని నిరాశపరచింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఆచార్య భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం రాం చరణ్ శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ కు నేషనల్ వైడ్ గా పాపులారిటీ రాగా శంకర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంటాడని అంటున్నారు.
సినిమాలో చరణ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్ లు కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాకు టైటిల్ గా అధికారి అని ఒక టైటిల్ ఫిల్మ్ నగర్ లో సర్క్యులేట్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ దాకా వెళ్లిన అధికారి టైటిల్ పై వారు అప్సెట్ లో ఉన్నారు. సినిమాకు ఎంత యాప్ట్ అనిపించినా 90వ దశకంలో వచ్చిన డబ్బింగ్ సినిమాలకు పెట్టిన టైటిల్ గా అధికారి ఉందని టైటిల్ మార్చాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఐ తర్వాత ఇండియన్ 2 సినిమా మొదలు పెట్టిన శంకర్ అనివార్య కారణాల వల్ల ఆ సినిమాని ఆపేశారు. ప్రస్తుతం చరణ్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టిన శంకర్ ఈ సినిమాతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. శంకర్, చరణ్ కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత చరణ్ గౌతం తిన్ననూరి డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: