విజయ్ స్పీడ్ కి షాక్ అవుతున్న హీరోలు..!

shami
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన 66వ సినిమా చేస్తున్నారు. కెరియర్ లో మొదటిసారి తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు విజయ్. అదికూడా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈమధ్యనే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైన ఈ సినిమా 25 రోజులు పాటు జరుపుకుంది.
మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. బీస్ట్ సినిమా తర్వాత విజయ్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ కేవలం కొద్ది రోజులు మాత్రమే కేటాయించారని తెలుస్తుంది. అందుకే ఇచ్చిన ఆ డేట్స్ లోనే సినిమా పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఎలాంటి టైం వేస్ట్ పనులు చేయకుండా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా చేస్తున్నారట.
ఇప్పటివరకు జరిగిన మొదటి షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు షూట్ చేసినట్టు తెలుస్తుంది. విజయ్ కూడా సినిమా అవుట్ పుట్ మీద చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ తెలుగులో డైరెక్ట్ గా చేఏస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా దళపతి విజయ్ యాక్టివ్ గా పాల్గొంటారని. సినిమా కోసం హైదరాబాద్ లో కొన్నాళ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఒక మంచి కథతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందట. సినిమాలో విజయ్, రష్మికల మధ్య సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు చిత్రయూనిట్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: