తలపతి విజయ్ 66 మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నడు. ఈ సమూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా,  మెహరీన్ కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు ఆయన శ్రీకాంత్ కూడా ఈ మూవీ లో నటించబోతున్నాడు.

ఈ మూవీ ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ పైడిపల్లి తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ ను పూర్తి చేశామని.. ఈ షెడ్యూల్‌ లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విజయ్,  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  సినిమా విజయ్ కెరియర్ పరంగా 66 వ సినిమా.  ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ఈ మూవీ తాజా షెడ్యూల్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు.

 ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో,  భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నట్టు ఒకానొక సందర్భంలో విజయ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: