అందుకే తన ప్రేమ వ్యవహారం బయటపెట్టా అంటున్న రకుల్..!!

Divya
సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను రహస్యంగా దాచి చేయాలని అనుకుంటారు. అయితే ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే చెబుతూ ఉంటారు.. మరీ ముఖ్యంగా తమ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివరాలను అంత సులువుగా ఏ ఒక సెలబ్రిటీ కూడా బయట పెట్టరు అని చెప్పవచ్చు. పెళ్లి దాకా వచ్చిన తర్వాత కానీ సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేయడం మొదలు పెడతారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది అని చెప్పవచ్చు.
ఇకపోతే వీరికి భిన్నంగా రకుల్ తన ప్రేమ వ్యవహారం గురించి ముందుగానే అభిమానులతో పంచుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇకపోతే బాలీవుడ్ నిర్మాత  జాకీ భగ్నానీ తో తాను ప్రేమలో ఉన్నానని గతంలో సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ప్రేమలో పడిన తొలి రోజుల్లోనే ఎలాంటి దాపరికం లేకుండా సోషల్ మీడియా వేదికగా తమ బంధం గురించి ఆమె వెల్లడించింది. అయితే ఇలా తన ప్రేమ వ్యవహారాన్ని అందరితో చెప్పి మంచి పని చేశాను అంటూ రకుల్ ప్రీతి తాజాగా చెప్పుకోచ్చింది.
రకుల్ మాట్లాడుతూ ప్రేమలో పడిన విషయాన్ని తొలి రోజుల్లోనే ఎలాంటి దాపరికం లేకుండా అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాము అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తన ప్రేమ వ్యవహారాన్ని అందరితో పంచుకోవడం చాలా మంచిది అయింది అని ఒకవేళ తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి ఉంచినట్లయితే మీడియాలో వచ్చే రకరకాల కథనాలతో మనశ్శాంతి కరువు అయ్యేదని  అసలు విషయాన్ని బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి అయితే రకుల్ ప్రీతి సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని అప్పట్లోనే బయట పెట్టి మంచి పని చేసింది అని అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే రకరకాల ఇబ్బందులకు గురిచేసేవారు అని ప్రస్తుతం ఆ తిప్పలు ఏమీ లేవు అని ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: