'శేఖర్' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన శివాత్మిక రాజశేఖర్..!

Pulgam Srinivas
జీవిత రాజశేఖర్ ల ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక,  ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమా తోనే శివాత్మిక తన నటనతో , అందచందాలతో  ప్రేక్షకులను ఆకట్టుకుంది.  

శివాత్మిక 'దొరసాని' సినిమాలో  చిన్న దొరసాని అనే పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలను పొందింది.  ఈ సినిమాలో శివాత్మిక అద్భుతమైన నటనను చూసిన చాలా మంది ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది అని అనుకున్నారు.  

కాకపోతే శివాత్మిక  'దొరసాని'  సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ  సినిమాతో  కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దానికి ప్రధాన కారణం శివాత్మిక నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటించాలని భావించడమే అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శివాత్మిక ,  రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాత్మిక  మాట్లాడుతూ... మే 20 వ తేదీన శేఖర్ సినిమా విడుదల అవుతోంది చూసి ఎంజాయ్ చేయండి అని తెలియజేసింది.
 

ఇది ఇలా ఉంటే శేఖర్  మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాత్మిక  స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.  శివాత్మిక  'శేఖర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బ్లాక్ కలర్ లో వైట్ కలర్ డాట్స్ ఉన్న శారీ కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి 'శేఖర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చింది.  శివాత్మిక 'శేఖర్' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వేసుకున్న డ్రెస్ తో చూపరుల మనసు దోచుకుంది.  అలా శివాత్మిక  'శేఖర్'  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: