"టైటిల్ ఒకటే... సినిమాలు రెండు"... ఫలితం ఏమిటో తెలుసా?

VAMSI
సినిమా ప్రేక్షకులలోకి వెళ్లడంలో టైటిల్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. టైటిల్ ను బట్టి ఎవరికి వారు ఈ సినిమా ఇలా ఉంటుంది ? అలా ఉంటుంది ? అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అందుకే హీరోలు దర్శకులు టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే గతంలో ఒక టైటిల్ తో వచ్చిన సినిమాను మళ్ళీ అదే టైటిల్ తో వేరొకరు సినిమా తీస్తే ఎలా ఉంటుంది. కథ బాగుంటే హిట్ అవుతుంది లేదంటే ప్లాప్ అవుతుంది. అదే విధంగా కొందరు డైరెక్టర్లు గతంలో సినిమా టైటిల్ ను వాడుకుని తమ కథలను సైతం సరిగా ప్లాన్ చేసుకుని హిట్ లు కొట్టారు. మరి ఆ సినిమాలు ఏవి అనేది ఒకసారి చూద్దాం.
1. శ్రీనివాస కళ్యాణం: 1987 వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఇందులో అప్పుడప్పుడే హీరోగా వస్తున్న వెంకటేష్ హీరోగా, భాను ప్రియ, గౌతమి, మోహన్ బాబు లు ఇతర పాత్రలలో నటించారు. సినిమా సూపర్ హిట్ అయింది. వెంకటేష్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత 2018 లో సతీష్ వేగేశ్న అనే దర్శకుడు నితిన్ ను హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా ఇదే టైటిల్ తో తీశాడు. ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని ఒక మోస్తరు విజయాన్ని నమోదు చేసుకుంది.
2. శ్రీమంతుడు: అక్కినేని నాగేశ్వరరావు, జమున హీరో హీరోయిన్ లుగా కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా మంచి ప్రేమకథాచిత్రంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంది. ఆ తర్వాత 44 సంవత్సరాలకు మహేష్ బాబు శృతిహాసన్ హీరో హీరోయిన్ లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక మంచి సామాజిక బాధ్యతతో ఇదే టైటిల్ తో నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
3. తొలిప్రేమ: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ప్రేమకథాచిత్రం తొలిప్రేమ. ఇందులో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మళ్ళీ అదే కుటుంబం నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ అదే టైటిల్ ను పెట్టుకుని సినిమా చేశారు. ఇందులో వరుణ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా వరుణ్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.
4. మహర్షి: 1988 లో వంశీ డైరెక్షన్ లో వచ్చిన 'మహర్షి' చిత్రం ఒక సంచలనం అని చెప్పాలి. ఇందులో పాటలు, కథ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే రాఘవ హీరోలాగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత నుండి రాఘవ పేరు కాస్తా... మహర్షి రాఘవ గా మారింది. ఆ తర్వాత 2019 లో మహేష్ బాబు మరియు పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో అదే టైటిల్ తో వచ్చింది. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది.
5. దేవదాసు: అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా దేవదాసు. అప్పట్లో ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. ఇందులో అక్కినేని నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇందులో తనకు జోడీగా నటించిన సావిత్రి నటించింది. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ కూడా అదే టైటిల్ తో సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇది ఒక లవ్ అండ్ మ్యూజికల్ హిట్ గా పేరొందింది. ఇలా ఒకే టైటిల్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: