సన్ ఆఫ్ ఇండియా చిత్రం ఓటిటి లో రిలీజ్..!!

Divya
మంచు మోహన్ బాబు హీరోగా డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ఈ ఏడాది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అయి మంచి పేరుపొందింది. ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాను చూసిన జనాలు డీసెంట్ టాక్ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు. ఈ చిత్రంలో బాగా నటించినప్పటికీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ..vvx సరిగ్గా లేదని కథ కూడా చాలా వీక్ గా ఉందని తెలియజేశారు.

ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర ఎక్కువ రోజులు నిలువ లేక పోయింది. కరోనా థర్డ్ వేవ్ తో థియేటర్  ఆక్యుపెన్సీ 50% కుదించారు. కానీ సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి మాత్రం 100% ఆక్యుపెన్సీ థియేటర్లు రన్ చేసుకునేలా అనుమతులు వచ్చినా.. ఆ అవకాశాన్ని కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. అయితే విడుదలైన చాలా రోజుల తర్వాత సన్ ఆఫ్ ఇండియా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు మంచి రేటు చెల్లించి తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రంపై పలువురు పలు రకాలుగా కామెంట్ చేయడం కూడా జరిగింది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా.. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమాకి మోహన్ బాబు స్క్రీన్ప్లే విభాగాన్ని పనిచేయడం విశేషం. ఇక ఇందులో  మీనా, శ్రీకాంత్, ఆలీ, తనికెళ్ల భరణి, కమెడియన్ సునీల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం దేశభక్తి కథాంశంతో తెరకెక్క చడం జరిగింది. అయినా కూడా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి అమెజాన్ ప్రైమ్ లో అయిన ఈ చిత్రం ఆకట్టుకుంటుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: