జయమ్మ పంచాయతీ చిత్రం ఎన్ని కోట్లు నష్టాన్ని మిగిల్చిందో తెలుసా..?

Divya
బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా పేరు పొందినది ఎవరని అడగగానే టక్కున వినిపించే పేరు యాంకర్ సుమ.. తాజాగా సుమ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. జయమ్మ పంచాయతీ చిత్రం ద్వారా గత శుక్రవారం మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రం మిక్స్డ్ టాక్ మూటకట్టుకుంది. ఇప్పటివరకు ఇలాంటి పాయింట్ తో ఏ సినిమా కూడా రాలేదని చెప్పవచ్చు. అయితే కథ పరంగా చాలా వీక్ గా ఉండడంతో ఫలితం చాలా తేడా కొట్టిందని చెప్పవచ్చు. ఓపెనింగ్ పరంగా మంచి కలెక్షన్లు రాబట్టిన వీకెండ్ చివరికి వచ్చే సరికి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ గా పడిపోయాయి ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
1). నైజాం-33 లక్షలు
2). సీడెడ్-14 లక్షలు
3). ఉత్తరాంధ్ర-15 లక్షలు
4). ఈస్ట్-6 లక్షలు
5). వెస్ట్-4 లక్షలు
6). గుంటూరు-10 లక్షలు
7). నెల్లూరు-5 లక్షలు
8). కృష్ణ-8 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.95 లక్ష రూపాయల వరకు రాబట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్-5 లక్షలు.
ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రూ. కోటి రూపాయల వరకు రాబట్టినట్లు సమాచారం. ఇక జయమ్మ పంచాయతీ చిత్రం విషయానికి వస్తే.. థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.3.45 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే రూ.3.5 కోట్ల రూపాయలు సంపందిచల్సిసి ఉంది. కానీ ఈ చిత్రం రన్ టైం ముగిసేసరికి కేవలం  రూ.కోటి రూపాయలు మాత్రమే రాబట్టింది. దీంతో ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయని చెప్పవచ్చు. ఈ చిత్రానికి పోటీగా ఎన్నో చిత్రాలు విడుదల అయినప్పటికీ.. ఇతర చిత్రాల పోటీలు నిలవలేకపోయింది ఈ జయము పంచాయతీ చిత్రం. దీంతో రూ.2.45 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మరి ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: